కారేపల్లి, జూన్ 29 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని బొక్కలతండాలో ఆదివారం ఆషాఢమాస బోనాల వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఉదయం గ్రామ దేవతలకు మహిళలు నీళ్లు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యువతులు, మహిళలు గ్రామంలో ఊరేగింపుగా బయల్దేరారు. మేళతాళాలు, డప్పుచప్పుల్లు, నృత్యాల మధ్య మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో గ్రామంలో తిరిగి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రాందాస్, భావుసింగ్, నారాయణ, పత్య, బాబులాల్, హతిరాం, రాంబాబు, కుమార్, లక్మ పాల్గొన్నారు.
Karepalli : బొక్కలతండాలో బోనాల వేడుక