మధిర, ఆగస్టు 20 : మధిర శివాలయం సమీపంలో గల వైరా మున్నేరు నదిలో మడుపల్లికి చెందిన పెసరవెల్లి వినోద్ మంగళవారం చేపల వేటకు వెళ్లి గల్లంతైన సంగతి తెలిసిందే. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. అయితే బుధవారం తాసీల్దార్ రాంబాబు, మధిర టౌన్ ఎస్హెచ్ఓ రమేశ్ యువకుడి ఆచూకీ కనుగొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందంను మధిరకు పిలిపించారు. నేడు ఉదయం ఎన్డీఆర్ఎఫ్ బృందం నదిలో గాలింపు చర్యలు చేపట్టగా గల్లంతైన యువకుడి మృతదేహం లభించింది.