కొత్తగూడెం క్రైం, నవంబర్ 6: పోలీసు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణతోపాటు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజు సూచించారు. వైద్య పరీక్షల ద్వారా డాక్టర్లు చెప్పే ఆరోగ్య సూత్రాలు విధిగా పాటించాలని అన్నారు. డీఎస్పీ రెహమాన్ ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులు, సిబ్బంది, వారి కటుంబ సభ్యులకు కొత్తగూడెం ఐఎంఏ హాల్లో బుధవారం నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపులో ఎస్పీ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. పోలీసులకు శారీర దారుఢ్యం ఉన్నప్పటికీ కొంతమేర మానసిక ఒత్తిడి ఉంటుందని అన్నారు.
దీనిని అధిగమించి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది అప్పుడప్పుడూ తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులు బాగోలేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో విధులు నిర్వహించాల్సి వస్తోందని అన్నారు. ఈ క్రమంలోనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు చేయిస్తున్నట్లు తెలిపారు. ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, ప్రముఖ వైద్య నిపుణులు నాగరాజు, కృష్ణప్రసాద్, కంభంపాటి రంగారావు, చారుగుండ్ల రాజశేఖర్, అయ్యప్ప, కృష్ణ, ఎరుక బాబురావు, ప్రవీణ్‌రెడ్డి, స్రవంతి, కల్యాణి, విజయలక్ష్మి, సీఐలు ముప్పారపు కరుణాకర్, కాగితోజు శివప్రసాద్, తొగిట రమేశ్, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.