భద్రాచలం, ఏప్రిల్ 11: ఇండియన్ రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. భద్రాచలంలో రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా వ్యాధి నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సికిల్‌సెల్ ఎనీమియా, రక్తహీనత పుట్టుకతో సంక్రమిస్తుందని, వ్యాధి తీవ్రతను బట్టి వారికి రక్తం ఎక్కించి కాపాడాల్సి ఉంటుందన్నారు.
పేదలు, గిరిజనుల సంక్షేమం కోసం ఒక్కోటి రూ.1,800 విలువ చేసే వ్యాధి నిర్ధారణ కిట్స్‌ను రూ.5 లక్షల వ్యయంతో ఐటీసీ పీఎస్పీడీ సారపాక వారు అందించారని పేర్కొన్నారు. జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ఎల్.కాంతారావు మాట్లాడుతూ రక్తనిధి కేంద్రంలో ఉచితంగా తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఎలక్ట్రోపర్సీస్ పద్ధతిలో నిర్వహిస్తామని, ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షకు రూ.2 వేలు ఖర్చవుతుందని, ఇందుకోసం సంస్థ ఆధ్వర్యంలో అందించే సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సభ్యులు వై.సూర్యనారాయణ, జి.రాజారెడ్డి, వి.కామేశ్వరరావు, గోళ్ల భూపతిరావు, జి.సంజీవరావు పాల్గొన్నారు.