చింతకాని, డిసెంబర్ 29: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తున్నామని ఎంఈవో మోదుగు శ్యాంసన్ అన్నా రు. గురువారం మండలంలోని నాగులవంచ ప్రాధమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని, బోధనాభ్యాసన, ఎఫ్ఎల్ఎన్ అమలు పక్రియలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం వీ కృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కూసుమంచి, డిసెంబర్ 29: తెలంగాణ ప్రభుత్వ చేపట్టిన తొలిమెట్టు కార్యక్రమంలో నిబంధనలు కచ్చితంగా అమలయ్యే విధంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని ఎంఈవో బీవీ రామాచారి అన్నారు. గురువారం కూసుమంచిలోని ప్రాథమిక, ఎస్సీ కాలనీ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్య సాధన దిశగా ప్రతీ ఉపాధ్యాయుడు వెనుక బడిన విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు.
కూసుమంచి రూరల్, డిసెంబర్ 29: విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించేందుకు కృషిచేయాలని ఎంఈవో బీవీ రామాచారి ఉపాధ్యాయులకు సూచించారు. తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని చేగొమ్మ, పెరికసింగారం ప్రాథమిక పాఠశాలల్లో బోధన తీరు, విద్యార్థుల సామర్థ్యాలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం, డిసెంబర్ 29: మండలంలోని తిరుమలాయపాలెం, పిండిప్రోలులో ప్రభుత్వ పాఠశాలలను గురువారం డీఈవో సోమశేఖర్శర్మ సందర్శించారు. ఈ సందర్భంగా తొలిమెట్టు కార్యక్రమం పురోగతిని సమీక్షించి, విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు. విద్యార్థుల సామర్థ్యం పెరుగుదలకు ఉపాధ్యాయులు దృష్టిసారించాలని ఆదేశించారు.