– హౌసింగ్ కార్పొరేషన్ డీఈఈ సాయిరామ్ రెడ్డి
కారేపల్లి, జనవరి 30 : లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని హౌసింగ్ కార్పొరేషన్ డీఈఈ సాయిరామ్ రెడ్డి సూచించారు. కారేపల్లి మండలంలోని ఇందిరమ్మ ఇండ్ల పోస్ట్ ఫ్యాక్టో వెరిఫికేషన్ ను సాయిరామ్ రెడ్డి అధ్వర్యం లో హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు ఆలస్యం చేయకుండా నిర్మాణ పనులు పూర్తి చేయాలని, నిబంధనల మేరకు స్టేజీల వారీగా నిధులు లబ్ధిదారుల ఖాతాలోనే జమ అవుతాయని చెప్పారు. ప్రభుత్వం పేదలకు కల్పించిన అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి హౌసింగ్ ఏఈ నాగేంద్ర బాబు, స్వప్న పాల్గొన్నారు.