కారేపల్లి,అక్టోబర్ 18: బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ వ్యాప్తంగా కారేపల్లి, ఏన్కూర్, వైరా, జూలూరుపాడు, కొనిజర్ల మండలాల్లో బంద్ (BC Bandh) ప్రశాంతంగా కొనసాగుతున్నది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరాల్సిందే అని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో విద్యాసంస్థలు స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి. మరోవైపు వ్యాపార, వాణిజ్య సంస్థలు సైతం బందుకు మద్దతుగా నిలిచాయి. అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో శాంతియుత వాతావరణంలో ఈ బందు కొనసాగుతుంది.
ఉదయం నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాల నాయకులు, ఎమ్మార్పీఎస్, టీడీపీ, కార్మిక సంఘాల నాయకులంతా బందులో పాల్గొంటున్నారు. మరోవైపు డిపోల నుంచి బస్సులు కదలకపోవడంతో బస్టాండ్లలో ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. అత్యవసర సర్వీసులకు బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు.