కారేపల్లి, సెప్టెంబర్ 19 : మేకలతండా బాలికల ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం బతుకమ్మ ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, మహిళా బోధనా సిబ్బంది కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ వేడుక జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం వెంకటరమణ మాట్లాడుతూ.. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని తెలిపారు. వివిధ రకాల పూలతో బతుకమ్మను అలంకరించి భక్తి శ్రద్ధలతో వేడుకలు నిర్వహించిన్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ వార్డెన్ ఇస్లావత్ హచ్యా నాయక్, సూర్య, కనకదుర్గ, ప్రమీల, భవాని, కళ్యాణి, నీరజ, మానస, ద్రౌపతి, నాగమణి, భవాని, మోహన్, సక్రం, బాలు, భీమ, చంద్రయ్య, శ్రీరామ్, భాస్కర్ రావు, తులసీదాస్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Karepally : మేకలతండా ఆశ్రమ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు