వైరా టౌన్, అక్టోబర్ 29: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు కష్టాలు తప్పవని వైరా బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్ హెచ్చరించారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. వైరా 14వ వార్డులోని ఇందిరానగర్ కాలనీలో ఆదివారం కౌన్సిలర్ డాక్టర్ కోటయ్య ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మదన్‌లాల్ మాట్లాడారు. వైరా నియోజకవర్గంలోని వైరా, కొణిజర్ల మండలాల్లో అత్యధికంగా దళితులు ఉన్నారని అన్నారు. ఈ రెండు మండలాలకు దళితబంధు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, మద్దెల రవి, నాయకులు పమ్మి తిరుమలరావు, మాదినేని దుర్గాప్రసాద్, మాచర్ల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
కొణిజర్ల, అక్టోబర్ 29: బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్‌ను గెలిపించాలని కోరుతూ మండలంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు-నాయకులు ఆదివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పోట్ల శ్రీనివాసరావు, శీలం కవిత తదితరులు పాల్గొన్నారు.
కారేపల్లి, అక్టోబర్ 29: మండలంలో ఆదివారం నా యకులు-ప్రజాప్రతినిధులు విస్తృత ప్రచారం నిర్వహించారు. మాలోత్ శకుంతల, వాంకుడోత్ జగన్, పెద్దబోయిన ఉమాశంకర్, రావూరి శ్రీనివాసరావు, హన్మకొండ రమేష్, ఉన్నం వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.
వైరా రూరల్, అక్టోబర్ 29: వైరా మండలం దాచాపురం గ్రామంలో సొసైటీ డైరెక్టర్ అయిలూరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గూడూరు రామశేషిరెడ్డి, ముక్కర పుల్లారెడ్డి, చెన్నారెడ్డి, వేల్పుల వెంకట్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. పాలడుగు గ్రామంలో జరిగిన ప్రచారంలో ఉప సర్పంచ్ గుండెపోగు జాన్, నాయకులు ఆరేపల్లి సీతారాములు, రాయల కిరణ్, పుల్లారావు, హుస్సేన్, మోదుగు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
వైరా రూరల్, అక్టోబర్ 29: ఆదివారం ఖమ్మం నుంచి అశ్వారావుపేట వెళ్తున్న ఎంపీ నామా నాగేశ్వరరావు.. మార్గమధ్యలో వైరా మండల స్టేజి పినపాక వద్ద ఆదర్శ రైతు తన్నీరు గోపాలరావును పలకరించారు. మదన్‌లాల్‌కు మద్దతు తెలపాలని కోరారు.
వైరా రూరల్, అక్టోబర్ 29: మండలంలోని సిరిపురం గ్రామంలో బీఆర్ఎస్ బూత్ కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. పార్టీకి అత్యధిక ఓట్లు పడేలా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. పార్టీ మండల అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వరరావు, నాయకులు కామినేని శ్రీనివాసరావు, మట్టూరు సత్యనారాయణ, పుచ్చకాయల బాబు, గుంటుపల్లి ముఖేష్, బాబు తదితరులు పాల్గొన్నారు.
కారేపల్లి,అక్టోబర్ 29: స్థానిక భరత్‌నగర్ కాలనీకి చెం దిన సుతారి మేస్త్రీ చెవుల నాగేశ్వరరావు(52) ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు. మృతదేహాన్ని బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్ సందర్శించి నివాళి అర్పించారు. కుటుంబీకులను పరామర్శించారు. పార్టీ మండల అధ్యక్షుడు పెద్దబోయిన ఉమాశంకర్, నాయకులు జడల వసంత, షేక్ గౌసుద్దీన్, ఆదెర్ల రాములు, మణికొండ నాగేశ్వరరావు, చెవుల చందు తదితరులు పాల్గొన్నారు.వైరా టౌన్, అక్టోబర్ 29: పట్టణంలోని 11వ వార్డు సోమవరం గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు కాంపల్లి వెంకట్(58) గుండెపోటుతో మృతిచెందారు. మృతదేహా న్ని బానోత్ మదన్‌లాల్ సందర్శించి నివాళి అర్పించారు. వెంకట్ కుటుంబీకులను ఓదార్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు, దిశా కమిటీ స భ్యుడు కట్టా కృష్ణార్జున్‌రావు, ఏఎంసీ చైర్మన్ పసుపులేటి మోహన్‌రావు, నాయకులు భూమాత కృష్ణమూర్తి, కాపా మురళీకృష్ణ, వనమా విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.