కారేపల్లి, నవంబర్ 6: వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్ గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ శ్రేణులు దూసుకుపోతున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గడప గడపకు వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి మదన్‌లాల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. మదన్‌లాల్ విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దబోయిన ఉమాశంకర్ ఆద్వర్యంలో గాదెపాడు లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, ఉన్నం వీరేందర్, అడ్డగోడ ఐలయ్య, దాచేపల్లి కృష్ణారెడ్డి, నన్నబాల మల్లయ్య, బానోత్ కుమార్, మాలోత్ కిశోర్, కేళోత్ స్వప్న, డేగల ఉపేందర్, ఎండీ హనీఫ్, రోశయ్య, బత్తుల శ్రీను, భూక్యా రాంకిశోర్, బత్తుల బాబూరావు, కేలోత్ పంతులు, బానోత్ కోటి, మద్దెబోయిన సత్యనారాయణ, సూర్యకుమార్, ప్రసాద్, నారాయణ, రమేశ్, కోటేశ్వరరావు, ఎజ్జు దాసు, ఈదర కోటేశ్వరరావు, దమ్మాలపాటి ప్రసాద్, సతీశ్, రాము, అర్జున్ పాల్గొన్నారు.
వైరారూరల్, నవంబర్ 6: వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్తు మదన్‌లాల్ విజయాన్ని కాంక్షిస్తూ మండలంలోని సిరిపురం గ్రామంలో సోమవారం బీఆర్ఎస్ నాయకుల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి ఇంటికి తిరుగుతూ సంక్షేమ పథకాలు, మ్యానిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. కారు గుర్తుపై ఓటు వేసి మదన్‌లాల్‌ను గెలిపించాలని కోరుతున్నారు. కార్యక్రమంలో నాయకులు కామినేని శ్రీనివాసరావు, మట్టూరి సత్యనారాయణ, గోరంట్ల చందు, నారపోగు రాంబాబు, అయినాల కనకరత్నం, తడికమళ్ల నాగశేషు, శ్రీనివాసరావు, రామారావు, వాకదాని వీరభద్రం, చప్పిడి భాస్కర్, తడికమళ్ల నాగేశ్వరరావు, గోరంట్ల వీరయ్య, తడికమళ్ల శ్రీనివాసరావు, మోరంపూడి ప్రసాదరావు, నవీన్ పాల్గొన్నారు.
వైరాటౌన్, నవంబర్ 6: మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో వార్డు కౌన్సిలర్ మాదినేని సునీత ప్రసాద్ మదన్‌లాల్ విజయాన్ని ఆకాంక్షిస్తూ వార్డు సభ్యులతో కలిసి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొణిజర్ల, నవంబర్ 6: వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. సోమవారం మండలంలో తలపెట్టిన ఎన్నికల ప్రచారం మండలంలోని రాజ్యాతండా నుంచి అమ్మపాలెం, తనికెళ్ల, తుమ్మలపల్లి, బోడియాతండా, అన్నవరం, రామనర్సయ్యనగర్ గ్రామాల మీదుగా సాగింది. దీంతో ఆ పార్టీ శ్రేణులు ఊరూరా పూలవర్షంతో ఘనస్వాగతం పలికారు. ప్రతి ఊర్లో మహిళలు అధిక సంఖ్యలో హాజరై హారతిచ్చి బొట్టు పెట్టి స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచార రథం వెంట ప్రత్యేక కోలాట బృందం, కళాజాత ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్శనగా నిలిచాయి. మండలంలోని రాజ్యాతండాలో బీఆర్ఎస్ నాయకులు మదన్‌లాల్‌కు క్రేన్ సహకారం భారీ గజమాలతో సత్కరించారు. ఆయన వెంట బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.