కారేపల్లి : ఈనెల 27న హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభకు సింగరేణి మండలం నుండి పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివెల్లి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు నిచ్చారు. శుక్రవారం కారేపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మదన్ లాల్ మాట్లాడుతూ వైరా నియోజకవర్గం అంటేనే ఉద్యమాల గడ్డ అన్నారు.
నాటి తెలంగాణ పోరాటం నుండి నేటివరకు అడుగడుగునా బీఆర్ఎస్కు ప్రజలు జేజేలు పలుకుతున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ క్రియాశీలక పాత్ర పోషించిందన్నారు. 25 ఏళ్ల పార్టీ ఆవిర్బావ వేడుకలను వాడవాడలో పండుగలా నిర్వహించాలని కోరారు. బహిరంగ సభకు తరలి వెళ్లే పార్టీ శ్రేణులకు ప్రాధాన్యత ఇవ్వాలని స్థానిక నాయకులను కోరారు. కారేపల్లి మండలం నుండి సుమారు 2000 మందిని బహిరంగ సభకు తరలించేందుకు మండల బాధ్యులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసిలు వాంకుడోత్ జగన్, ఉన్నం వీరేందర్, మాజీ రైతుబంధు వైరా నియోజకవర్గ కన్వీనర్ హనుమకొండ రమేష్, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా నాయకుడు షేక్ గౌసుద్దీన్, ఉద్యమ నాయకులు జడల వెంకటేశ్వర్లు, జడల వసంత, సోమందుల నాగరాజు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ బన్సీలాల్, నాయకులు పేర్ని వెంకటేశ్వర్లు, దొంకెన రవి మణికొండ నాగేశ్వరరావు, జాటోత్ వీరియానాయక్, రాములు,ధారావత్ వికాస్, రాజేష్, తెలగుర్ల రామారావు, జుంకీలాల్, భూక్యచందు నాయక్, బుల్లి అప్పారావు, హరీష్, నరేన్, తాత వెంకటేశ్వర్లు, పిల్లలమర్రి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.