కారేపల్లి,ఏప్రిల్ 25 : తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిరిగి మళ్లీ కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారని వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలలో భాగంగా శుక్రవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెలంగాణ ఉద్యమకారుడు సోమందుల నాగరాజు చేతుల మీదుగా జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా బానోత్ మదనలాల్ మాట్లాడుతూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకు బీఆర్ఎస్ ఆవిర్భవించిందన్నారు.
అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలు విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త వరంగల్ తరలివెల్లి సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు వాంకుడోతు జగన్, ఉన్నం వీరేందర్, ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ బన్సీలాల్, మైనార్టీ నాయకులు షేక్ గౌసుద్దీన్, నాయకులు తాతా వెంకన్న, దొంకేన రవీందర్, గుగులోత్ సక్రు, చందు తదితరులు పాల్గొన్నారు.