కారేపల్లి,జనవరి 18 : ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుబడిన నాయకుడు మాజీ సీఎం నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ సింగరేణి మండల అధ్యక్షుడు బండిపూరి శ్రీనివాసరావు అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కారేపల్లి బస్టాండ్ సెంటర్, కొత్త కమలాపురం, గాంధీనగర్, మాదారం, భాగ్యనగర్ తండాలో ఎన్టీఆర్ విగ్రహా పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మండల కేంద్రంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్ తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. అదేవిధంగా రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిన నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి గ్రామ శాఖల అధ్యక్ష,కార్యదర్శులు, తెలుగు యువత నాయకులు,టీడీపీ ఇతర పార్టీల కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.