Manuguru | రాఖీ రోజే దారుణం.. పండుగకు ఇంటికొచ్చిన యువకుడిని కొట్టి చంపేశారు..!
Manuguru : రాఖీ పండుగ కోసం ఇంటికి వచ్చిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో.. మణుగూరు కాందర్(MK) గ్రూప్‌లోని 30 మంది మూకుమ్మడిగా దాడి చేసి అతడిని పొట్టనబెట్టుకున్నారు.
Manuguru : రాఖీ పండుగ కోసం ఇంటికి వచ్చిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో.. మణుగూరు కాందర్(MK) గ్రూప్‌లోని 30 మంది మూకుమ్మడిగా దాడి చేసి అతడిని పొట్టనబెట్టుకున్నారు. పండుగపూట జరిగిన ఈ దుర్ఘటనలో శివ అనే ఇంటీరియర్ డిజైనర్ ప్రాణాలు కోల్పోయాడు. రాఖీ రోజునే చనిపోయిన తన సోదరుడికి కన్నీళ్లతో చివరి రాఖీ కట్టింది సోదరి.
హైదరాబాద్‌లో ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తున్న శివ(28).. రాఖీ పండుగ సందర్భంగా సొంత గ్రామమైన మణుగూరుకు వచ్చాడు. తన వద్ద పనిచేసే సతీష్ అనే కార్మికుడి సోదరిని స్థానిక యువకులు కొందరు వేధిస్తుండడంతో గతంలో ఆ గ్యాంగ్‌ను శివ హెచ్చరించాడు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న ఆ గ్యాంగ్.. శుక్రవారం మాట్లాడుదామని శివను ఏరియా స్టోర్ గ్రౌండ్స్‌కు పిలిచి.. పక్కా ప్లాన్‌తో హత్య చేసింది. గతంలో తమను హెచ్చరించిన శివను అంతమొందించాలని గ్యాంగ్ హెడ్ రమ్మీ, అతని అనుచరులు అతడి హత్యకు పథకం వేశారు. రాఖీకోసం శుక్రవారం స్వగ్రామం వచ్చిన శివను.. మాట్లాడుతామని రియా స్పోర్ట్స్ గ్రౌండ్‌కు తీసుకెళ్లారు.
కాసేపట్లోనే అక్కడికి మణుగూరు కాందర్ గ్రూప్‌లోని 30 మంది చేరుకొని శివపై మూకుమ్మడిగా దాడి చేశారు. పిడిగుద్దులు గుద్దుతూ విచక్షణారహితంగా ఎంకే గ్యాంగ్ దాడి చేయడంతో ఊపిరితిత్తులు పగిలిపోయి, పక్కటెముకలు విరిగిపోయి శివ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. శివను కాపాడేందుకు ప్రయత్నించిన ఉదయ్ కుమార్ అనే యువకుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. శివ హత్య కేసులో ఏడుగురిపై BNS సెక్షన్ 182(2), 103(2), 115(2), 190తో పాటు ఇతర కేసు నమోదు చేసిన పోలీసులు పరారైన వారి కోసం గాలిస్తున్నారు. గ్రామంలో మణుగూరులో MK గ్యాంగ్ నిత్యం అరాచకాలు చేస్తున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోయారు. ఈ గ్రూప్ సభ్యులు ఊర్లో నిత్యం వివాదాలు సృష్టించి ప్రజలను కొడుతూ హింసిస్తారని, 80 మంది ఉండే ఈ గ్రూప్‌పై చర్యలు తీసుకోవాలని శివ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
మణుగూరులో దారుణం
రాఖీ పండుగ కోసం ఇంటికి వచ్చిన యువకుడిని దారుణంగా కొట్టి హత్య చేసిన మణుగూరు కాందర్(MK) గ్రూప్‌లోని 30 మంది
పండుగ రోజు చనిపోయిన తన సోదరుడికి కన్నీళ్లతో చివరి రాఖీ కట్టిన సోదరి
హైదరాబాద్‌లో ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తూ, రాఖీ పండుగ సందర్భంగా సొంత గ్రామమైన… pic.twitter.com/bElMicDfhn
— Telugu Scribe (@TeluguScribe) August 28, 2026
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

