రామవరం, అక్టోబర్ 16 : మద్యానికి బానిసై యుకుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం టూ టౌన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. చుంచుపల్లి మండలం గౌతమ్‌పూర్ గ్రామానికి చెందిన శంఖవార్ కార్తీక్ (25) మద్యానికి బానిసయ్యాడు. జీవితం పట్ల విసుగుచెంది తన ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన వెంటనే టూ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. టూ టౌన్ సీఐ డి.ప్రతాప్ ఆదేశాల మేరకు ఎస్ఐ మనీషా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.