కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 18 : రాష్ట్రంలో నిర్వహించే ఆందాల పోటీలను వెంటనే రద్దు చేయాలని ప్రగతి శీల మహిళా సంఘం (POW) రాష్ట్ర కోశాధికారి వై. జానకి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మే 7 నుండి మొదలై 31 వరకు తెలంగాణ హైదరాబాదులో జరిగే 72 వ ప్రపంచ అందాల పోటీలకు 120 దేశాల నుండి మహిళా ప్రతినిధులు ఈ పోటీల్లో పాల్గొంటారని, ఈ అందాల పోటీలకు ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెడుతుందన్నారు. ప్రజలకు ఎంత మాత్రం అవసరంలేని మరింత భారం పెంచే అందాల పోటీలు నిర్వహించడం అవసరమా? అని ఆమె ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 15 నెలల కాలంలో లక్షా 50 వేల కోట్ల అప్పులో ఉందని ఆరోపించారు.
అందం ఉంటేనే ఆత్మవిశ్వాసం, గుర్తింపు వస్తాయని అదే వ్యక్తిత్వం అని అందాల పోటీలు ఇప్పటికే బాగా ప్రచారం చేస్తున్నాయని, మెట్రోపాలిటీ సిటీలు నగర పట్టణాల నుండి కాలేజీల వరకు ఈ ప్రచారం వ్యాపించిందన్నాఉ. అందంగా ఉండాలని, అందం అంటేనే మహిళా అనే ఒక సంస్కృతిని ఈ అందాల పోటీలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. కార్పొరేట్ శక్తులు ధనర్జన కోసం వారి వ్యాపారాల లావాపేక్ష కోసం, సృష్టిస్తున్న ఈ అందాల పోటీలను వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు.
ప్రపంచ అందాల పోటీలను వ్యతిరేకిస్తూ అన్ని మహిళా విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 21న చలో కలెక్టరేట్ ధర్నా చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.లక్ష్మి, పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి కల్తి సుభద్ర, జిల్లా నాయకురాలు జి మంజుల, హరిద్వార్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ లక్ష్మి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కలంగి హరికృష్ణ, పిడిఎస్ యు పి యు ఎల్ రాష్ట్ర నాయకులు వి.మోతిలాల్, బి శ్యామ్, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ సంజీవ్ వివిధ ప్రజాసంఘాల నాయకులు కిరణ్ సాయి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.