భద్రాద్రి కొత్తగూడెం. మే 17 : లో ఓల్టేజి సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం కొత్తగూడెం కలెక్టరేట్లో విద్యుత్ సబస్టేషన్లకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో మాట్లాడారు. జూన్ 2న యువకుల కోసం కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ సమస్య రాకుండా సకాలంలో మరమ్మతులు చేయడానికి అంబులెన్సులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే కూనంనేని సాంభశివరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రామ సాహాయం రఘురామ్ రెడ్డి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కలెక్టర్ జితేష్, సింగరేణి సీఎండీ బలరాం పాల్గొన్నారు.
Bhadradri Kothagudem : నాణ్యమైన విద్యుత్ అందిస్తాం : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క