రామవరం, సెప్టెంబర్ 04 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ & వెల్ఫేర్ ఫౌండేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలిగా సామాజికవేత్త డాక్టర్ డా.వంగర రమాదేవి నియమితులయ్యారు. ఈ మేరకు సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ & వెల్ఫేర్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షురాలు రారియన్ సుష్మా ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సఖీ కార్యాలయంలో ఉత్తర్వులను రమాదేవికు కార్యాలయ ఇన్చార్జి చంద్రకళ గురువారం అందచేశారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు, వారి ఆర్థిక పురోభివృద్ధికి సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమలు చేపడతామని తెలిపారు. ప్రధానంగా జిల్లాలో బాల్య వివాహాలు అరికట్టడం కోసం, మహిళల పట్ల వివక్షత అరికట్టడం కోసం పని చేస్తానని చెప్పారు.
మహిళలు తమకు ఏ ఆపద కలిగినా తన నంబర్ 6281240539 కు సమాచారం అందించొచ్చని తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షురాలు రారియన్ సుష్మా, జాతీయ కౌన్సిల్ సభ్యులు మహమ్మద్ షాభానా, మహమ్మద్ సల్మా, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యురాలు జోగు కల్యాణి, సాదియ సిద్దిఖా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కో ఆర్డినేటర్ బొర్ర జయమ్మ కు రమాదేవి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ నీలివేణి పాల్గొన్నారు.