– రెండేళ్ల 7 నెలలుగా కొనసాగుతున్న ఉపేందర్ దాస్ ఆధ్యాత్మిక యాత్ర
రుద్రంపూర్, జనవరి 24 : బీహార్ రాష్ట్రం బంకా జిల్లాకు చెందిన ఉపేందర్ దాస్ తన ఆధ్యాత్మిక సంకల్పంతో దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి నుండి తమిళనాడులోని రామేశ్వరం వరకు రోడ్డుపై పాకుతూ ప్రయాణం చేస్తూ తన యాత్రను కొనసాగిస్తున్నాడు. ఈ అసాధారణ ప్రయాణం ప్రారంభించి రెండు సంవత్సరాల ఏడు నెలలు పూర్తయ్యిందని ఉపేందర్ దాస్ తెలిపాడు. ఇప్పటివరకు ఆరు రాష్ట్రాలను దాటి ముందుకు సాగినట్లు చెప్పారు. భక్తి, సంకల్పం, ఆత్మనిబద్ధతకు ప్రతీకగా నిలిచిన ఈ యాత్రలో ఎండలు, వర్షాలు, రహదారి కష్టాలు అన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాడు. తన ప్రయాణం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఆధ్యాత్మిక శుద్ధి, ధర్మ పరిరక్షణ, దేశంలో శాంతి సామరస్యాన్ని చాటడమేనని ఆయన పేర్కొన్నారు. ఉపేందర్ దాస్ ప్రయాణం ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక మందికి ప్రేరణగా నిలుస్తుండగా, ఆయన త్యాగం, సహనం, భక్తి భావాలను పలువురు ప్రశంసిస్తున్నారు.

Rudrampur : గంగోత్రి నుండి రామేశ్వరం వరకు పాకుతూ ప్రయాణం