చండ్రుగొండ, జూలై 14 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో వర్షాభావ పరిస్థితుల్లో వరి నారుమడులు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. గతంలో కంటే ఈ ఏడాది తక్కువ వర్షపాతం నెలకొనడంతో చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోయాయి. వ్యవసాయ బోరు మోటర్ కింద కొంతమేర పచ్చగా పైరులు ఉన్నా, వర్షాధార పైరులు మాత్రం ఎండిపోతున్నాయి. మరికొద్ది రోజులు ఇలాగే వర్షాలు కురవకుండా ఉంటే వరి పంట ప్రశ్నార్థకంగా మారుతుందని రైతులు వాపోతున్నారు.