రామవరం, జూన్ 02 : తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర చిరస్మరణీయమని, కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకుడు సంకుబాపున అనుదీప్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం సింగరేణి కొత్తగూడం ఏరియా కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్ మార్కెట్ సెంటర్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అమరుల త్యాగాలకు నివాళి అర్పించే సంస్కరణ దినం అని నాడు తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర మర్చిపోలేదన్నారు. సకలజనుల సమ్మెలో వారు చూపెట్టిన పోరాట పటిమ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైందన్నారు.
2001లో టీఆర్ఎస్ స్థాపనతో మొదలైన పోరాటం 2014 జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావంతో విజయవంతమైందన్నారు. కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి పదేళ్లపాటు తెలంగాణను అభివృద్ధి మార్గంలో నడిపించారు. నీటి ప్రాజెక్టులు, రైతు బంధు, విద్యుత్, సంక్షేమ పథకాల ద్వారా తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బీర్ఎస్ నాయకులు గూడెల్లి యాకయ్య, సౌల శ్రీనివాస్, బావు సతీశ్, కన్ని, మునవర్, కలకోటి ఐలయ్య, పద్మ ,శ్రీకాంత్, ఐఎన్టీయూసీ కొత్తగూడెం ఏరియా ఎండీ రజాక్, సకినాల సమ్మయ్య భాస్కర్, చిలక రాజయ్య, గౌస్, ఎస్సీ ఎస్టీ నాయకులు చెరిపెల్లి నాగరాజు, కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ ఉమర్, సీపీఎం పార్టీ నాయకుడు గోసు సుబ్బారావు పాల్గొన్నారు.