– అధ్యక్షుడిగా గుమ్మడోజు తిరుపతి
టేకులపల్లి, ఫిబ్రవరి 04 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల డెకరేషన్, లైటింగ్, సౌండ్ సిస్టం యూనియన్ ను బుధవారం మండల కేంద్రంలో ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. డెకరేషన్ యూనియన్ లో 38 మంది సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. యూనియన్ అధ్యక్షుడిగా గుమ్మడోజు తిరుపతి, ఉపాధ్యక్షుడిగా గుగులోత్ సురేందర్, ప్రధాన కార్యదర్శిగా ఈసం రాజేష్, కార్యదర్శిగా భూక్య కిషన్, కోశాధికారిగా ఊకే లక్ష్మయ్య, కార్యవర్గ సభ్యులుగా జాల మురళి, నల్లమాస శంకర్ గౌడ్, ధరవత్ లాలు, మాదే అనిల్ కుమార్, సిలివేరు శ్రీనివాస్, ధరవత్ సురేష్, భూక్య వెంకీ, కుమార్, దొడ్డ వెంకటేశ్వర్లును ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు.