ఇల్లెందు, ఏప్రిల్ 17 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అవగాహనా రాహిత్యంతో మాట్లాడటం సరికాదని బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ అన్నారు. శుక్రవారం ఇల్లెందు జగదాంబ సెంటర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా మహిళా బిల్లుపై మాట్లాడకుండా తెలంగాణ విభజనను ఇండియా, పాకిస్థాన్ విభజనతో పోల్చి రాజ్యాంగాన్ని, నాలుగు కోట్లమంది తెలంగాణా ప్రజలను అవగాహనా రాహిత్యంతో తేజస్వి సూర్య అవమాన పరిచారు. ఇది తెలంగాణ అమరవీరుల త్యాగాలను అవహేళన చేయడమే అన్నారు.
తన మాటలను వెనక్కు తీసుకుంటూ భేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం బీజేపీ కూడా తెలంగాణా జేఏసీలో భాగస్వామిగా ఉండి రోడ్ల మీద ఉద్యమాలు చేసిందని, తెలంగాణ బిల్లుకు పార్లమెంట్ లో గట్టి మద్దతుదారునిగా నిలిచిందనే కనీస సోయి కూడా ఒక పార్లమెంట్ సభ్యుడిగా అవగాహన లేకుండా మాట్లాడటం విచారకరం అన్నారు. పార్లమెంట్ లో దాదాపుగా అన్ని పార్టీలు తెలంగాణ బిల్లును ఆనాడు సమర్దించాయి. తేజస్వి సూర్య మాత్రం తన అవగాహన లేమితో వారందరిని అవమానించినట్లుగానే భావించాల్సి వస్తుందన్నారు. ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడి రాజ్యాంగాన్ని, తెలంగాణా ప్రజలను అవమాన పరిచిన తేజస్వి సూర్యను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు సుదర్శనం రంగనాథ్, సిలివేరు సత్యనారాయణ, ఎండీ.అబ్దుల్ జబ్బార్, శీలం రమేష్, పరిచూరి వెంకటేశ్వర్లు, ఎస్కే.గాజీ అజ్మేరా భావ్ సింగ్, దాస్యం ప్రమోద్, డేరంగుల పోషం, నాగరాజు, నారపాక వసంతరావు, రాచపల్లి శ్రీను, సనా రాజేష్, స్వర్ణ పాక సత్యనారాయణ, రామ్‌లాల్ పాసి, లలిత్ పాసి, శ్రీకాంత్, మల్సూర్, యలమందల వాసు, చిన్నారి గడ్డి శ్రీను, అటో పాసి గధే రమేష్, శ్రీను, ఎస్కే.ఇమ్రాన్, గోల్డ్ ఇమ్రాన్, షేక్ కరీం పాషా, చీమల సుజాత, మదర్ బీ, భాగ్య, దమర శ్రీనివాస్, కుంజ సతీష్, మనఘంటి శివ, రసూల్ మాన్య, కిషన్ పాసి, వీరభద్రం, శ్రీనివాస రావు, కోడి లక్ష్మయ్య, బజారు సత్యనారాయణ, ఖమృ, శ్రీకాంత్ యాదవ్, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రజలకు తేజస్వి సూర్య క్షమాపణలు చెప్పాలి : దిండిగాల రాజేందర్