భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 04 : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కొత్తగూడెం కార్పొరేషన్ ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వడంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. దీంతో నాయకులు గెలుపుపై ధీమాగా ఉన్నారు. పాల్వంచలో తెక్వాండో క్రీడాకారిణి, బీఆర్ఎస్ 7వ డివిజన్ అభ్యర్థి సింధూ తపస్వి బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించి తనను గెలిపించాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు.