– గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆగ్రహం
రామవరం, అక్టోబర్ 27 : కార్మికులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరించింది. ఈ నెల నిర్వహించిన సర్ఫేస్ ఫిట్టర్స్, ఎలక్ట్రీషియన్స్ కౌన్సెలింగ్లో అవకతవకలు జరిగాయని కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వి.మల్లికార్జునరావు అన్నారు. సోమవారం కొత్తగూడెం ఏరియాలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జీఎం కి మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూనియర్ టెక్నీషియన్స్ ను సత్తుపల్లికి పంపి అక్కడ విధులు నిర్వహిస్తున్న సీనియర్ టెక్నీషియన్స్ ను ఏరియాలోని డిపార్ట్మెంట్స్లో సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు.
జరిగిన కౌన్సెలింగ్ని రద్దు చేసి మళ్లీ కౌన్సెలింగ్ నిర్వహించి సీనియారిటీ ప్రకారం బదిలీ చేసి సీనియర్ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా వికె కోల్ మైన్లో పంప్ ఆపరేటర్ ఖాళీలను భర్తీ చేయాలని, పంప్ ఆపరేటర్ యాక్టింగ్ చేస్తున్న కార్మికులకు అర్హతను, యాక్టింగ్ మాస్టర్స్ బట్టి వారికి ప్రమోషన్ ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి, సహాయ కార్యదర్శి గట్టయ్య, ఆఫీస్ బేరర్స్ సందబోయిన శ్రీనివాస్, ఎస్ నాగేశ్వరరావు, హీరాలాల్, పిట్ కార్యదర్శులు హుమాయూన్, ఏం ఆర్ కే ప్రసాద్, సీనియర్ నాయకులు బండారి మల్లయ్య, బండి వెంకటరమణ, ప్రభాకర్, రమేశ్ పాల్గొన్నారు.