bhadradri | పోడు భూముల సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీ ఏర్పాటు: వైరా ఎమ్మెల్యే రాములునాయక్

జూలూరుపాడు: రాష్ట్రంలోని ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న పోడు భూములకు శాశ్వతంగా పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసిందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్ధార్ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మండలంలోని 21 మందికి మంజూరైన రూ.21, 2436 లక్షల విలువైన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. రాష్ట్రంలోని రైతుల వ్యవసాయ పంపు సెట్లకు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరాచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణలోని ఆడబిడ్డల కండ్లల్లో ఆనందం చూసేందుకు కళ్యాణలక్ష్మి ,షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి పెండ్లి సమయంలో మేనమామలా ఆదుకోవడం జరుగుతుందన్నారు.
పలు ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ముఖ్యమంత్రిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్ధార్ లూదర్విల్సన్, సహకారసంఘం అధ్యక్షులు లేళ్ల వెంకరెడ్డి, ఎంపీపీ లావుడ్యా సోని, జెడ్పీటీసీ భూక్యా కళావతి,రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు యదళ్లపల్లి వీరభద్రం,ఎంపీటీసీలు దుద్దుకూరి మధుసూదన్‌రావు, పొన్నెకంటి సతీష్‌కుమార్, పెండేల రాజశేఖర్,టీఆర్ఎస్ మండల అధ్యక్షులు చౌడం నర్సింహారావు, నానాయకులు వేల్పుల నర్సింహారావు, రంగారావు, నాగేశ్వరరావు, ఖాజా రమేష్, మోదుగు రామకృష్ణ, పుల్లయ్య తదితరులు ఉన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

