జూలూరుపాడు, ఆగస్టు 12 : చెట్లకు మేకులు కొట్టడం, తీగలు చుట్టడం వల్ల వాటి ఎదుగుదలకు ఆటంకం ఏర్పడుతోందని జూలూరుపాడు ఎంపీడీఓ తాళ్లూరి రవి అన్నారు. కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశానుసారం ‘సర్వీస్ టు వన దేవత’ పేరిట అధికార యంత్రాంగం వృక్షాలను కాపాడే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో భాగంగా మంగళవారం జూలూరుపాడు అధికార యంత్రాంగం మండలంలో ఉన్న చెట్లకు ఉన్న ప్రకటన బోర్డులు, తీగలు, మేకుల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. తీగలు కట్టిన చోట గాట్లు పడి చెట్టు ఎదుగుదల ప్రభావితం అవుతుందన్నారు. ఒక్కోసారి గాలి దుమారానికి విరిగి పడే ప్రమాదం ఉందని తెలిపారు.
చెట్లకు పెద్ద పెద్ద ప్రకటన బోర్డులు ఏర్పాటు చేయడంతో గాలులకు ప్రకటన బోర్డులు రోడ్డుపై పడిపోతూ వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నట్లు వెల్లడించారు. వినోబా నగర్, సాయిరాం తండా, పడమటి నరసాపురం ఏరియాల్లో రోడ్డు పక్కన చెట్లకు ఉన్న తీగలు, మేకులు తొలగించారు. సమస్య పునరావృతమైతే సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు. రోడ్డు పక్కన వృక్షాలపై పంచాయతీ సిబ్బంది. అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయనున్నారు.
Julurupadu : ‘చెట్లకు మేకులు కొట్టొద్దు, తీగలు చుట్టొద్దు’