బూర్గంపహాడ్, ఆగస్టు 28 : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను పట్టుకున్న సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలురెడ్డిపాలెం గొమ్మూరు వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అశ్వాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి టాటా మ్యాజిక్ వాహనంలో 10 బస్తాలు (5 క్వింటాళ్ల రేషన్ బియ్యం) రేషన్ బియ్యం కిలో రూ.17 చొప్పున కొనుగోలు చేసి వాహనంలో తీసుకువెళ్తుండగా అందిన సమాచారం మేరకు ఎస్ఐ మేడా ప్రసాద్ తన సిబ్బందితో కలిసి వెళ్లి టాటా మ్యాజిక్, బియ్యంను స్వాధీనం చేసుకుని వెంకటేశ్వర్లు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.