బూర్గంపహాడ్‌లో వెలవెలబోయిన ‘విత్తన మేళా’
వానాకాలం పంట సాగులో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకు బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఏర్పాటు చేసిన విత్తన మేళా (విత్తన వారోత్సవాలు) వెలవెలబోయింది. ఈ విత్తన మేళాలో వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది తప్ప
బూర్గంపహాడ్, జూన్ 23 : వానాకాలం పంట సాగులో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకు బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఏర్పాటు చేసిన విత్తన మేళా (విత్తన వారోత్సవాలు) వెలవెలబోయింది. ఈ విత్తన మేళాలో వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది తప్ప రైతులు ఎక్కడా కనిపించలేదు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన మేళాలో రైతులకు ఖరీఫ్ పంట సాగుకు సంబంధించి ప్రభుత్వం సరసమైన ధరలకు ఏడు వరి విత్తనాలు, పత్తి విత్తనాలు, కూరగాయ విత్తనాలు, నానో యూరియా, యూరియా వంటి ఎరువులను సిద్ధం చేసినప్పటికీ రైతులు ఈ విత్తన మేళాకు పెద్దగా ఆసక్తి చూపలేదు.
ఇదిలా ఉండగా వ్యవసాయ శాఖ విత్తన వారోత్సవాలకు సంబంధించి మండలంలో ముందస్తు ప్రచారం చేయకపోవడంతో విత్తన మేళాకు రైతులు హాజరుకాలేదా అనే ఆరోపణలు సైతం లేకపోలేదు. వారం రోజుల పాటు ఈ విత్తన వారోత్సవాలు నిర్వహించాల్సి ఉండగా తొలిరోజే రైతులు విత్తనమేళాకు హాజరు కాకపోవడంపై వ్యవసాయ శాఖ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలిరోజు కార్యక్రమంలో సర్పంచ్ మందా నాగరాజు, ఉప సర్పంచ్ గుండె వెంకన్న, మండల వ్యవసాయశాఖ అధికారి శంకర్, ఏఈఓలు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

