రామవరం, ఆగస్టు 15 : భద్రాచలం రవాణా శాఖ యూనిట్ కార్యాలయంలో మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్, అసోసియేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీజీవోస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సంగం వెంకట పుల్లయ్య రవాణా శాఖ ఉత్తమ అధికారిగా ఎంపికయ్యారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ఆయన పురస్కారం అందుకున్నారు. రోడ్డు భద్రత – ప్రమాదాల నివారణ కోసం వినూత్న పద్ధతుల్లో అవగాహన తరగతులు నిర్వహిస్తూ, ప్రజల్లో రహదారి భద్రతపై చైతన్యం కల్పించడంలో హెల్మెట్ల పంపిణీ, రక్తదానంపై అవగాహన, పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం వంటి సేవలకుగాను ఆయనను ఈ పురస్కారం వరించింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్, ఎస్పీ బి. రోహిత్ రాజు, జిల్లా అధికారులు, ఉద్యోగులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.