టేకులపల్లి, ఏప్రిల్ 16 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సంపత్‌నగర్ గ్రామవాసి కుడితేటి రమేశ్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. క్రిస్టియన్ గీతాలపై ప్రపంచ స్థాయిలో జరిగిన ఆన్లైన్ మ్యూజిక్ ప్రదర్శనలో రమేశ్ పాల్గొన్నాడు. కీబోర్డు వాయిద్య బృందం గంటలో 1,046 వీడియోలు అప్లోడ్ చేసింది. ఈ బృందంలో రమేశ్ సభ్యుడు. గడిచిన సోమవారం హైదరాబాద్ హోలెల్ మ్యూజిక్ స్కూల్ నిర్వాహకుల చేతుల మీదుగా అతడు మెడల్ అందుకున్నాడు. పట్టుదలతో సంగీతం నేర్చుకున్నానని, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌తో అరుదైన గౌరవం దక్కడం ఆనందంగా ఉందని రమేశ్ తెలిపాడు.