రామవరం, సెప్టెంబర్ 30 : సింగరేణి కొత్తగూడెం ఏరియాలో సెక్యూరిటీ విభాగంలో సుదీర్ఘంగా 36 సంవత్సరాల పాటు సేవలించిందిన సామర్ల గోపి పదవీ విరమణ పొందాడు. మంగళవారం నిర్వహించిన పదవీ విరమణ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష పాల్గొని మాట్లాడారు. సెక్యూరిటీ గార్డుగా గోపి చూపిన క్రమశిక్షణ, సమయ పాలన, విధేయత అసమానమైనవన్నారు. సంస్థ రక్షణలో ఆయన పాత్ర మరువలేనిదని ప్రశంసించారు. ఎస్టేట్ ఆఫీసర్ తౌర్య మాట్లాడుతూ.. జీఎం కార్యాలయం ముందు విధులు నిర్వహించడమంటే సాహసోపేతం అన్నారు. వచ్చే సందర్శకులకు సమాధానం చెబుతూ, అటు అధికారులతో సమన్వయంతో పని చేయాలన్నారు. ఏ రోజు కూడా ఎటువంటి గొడవలు లేకుండా అందర్నీ సమన్వయం పరుస్తూ గోపి డ్యూటీ నిర్వహించినట్లు కొనియాడారు. ఆయనను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి, మెమొంటోతో పాటు సెక్యూరిటీ డిపార్ట్మెంట్ గుర్తుగా బహుమతులు అందజేశారు. ఉద్యోగ విరమణ జీవితం ప్రశాంతంగా గడుపాలని అంతా ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎస్టేట్ అధికారి మధుమతి, సెక్యూరిటీ విభాగం మోహన్ రెడ్డి, జమేదార్లు వై.శ్రీనివాస్, జయరాజు, సెక్యూరిటీ గార్డ్స్ హనోకు రాజ్, త్రిపాటి, జనార్ధన్, సుధాకర్, సురేశ్, మాదిగ సంక్షేమ సంఘం నాయకులు కొయ్యడ వెంకన్న, కొత్తూరు మదనయ్య, సామర్ల సమ్మన్న, ఇండిగా పెళ్లి శంకర్, మాటేటి అంజయ్య, కొత్తూరు రవికుమార్, కూరగాయల శ్రీనివాస్, ఇల్లందుల దుర్గ, బోంకూరి పోశం, రామారావు, అన్నవరం కన్నా పాల్గొన్నారు.