బూర్గంపహాడ్, ఆగస్టు 22 : బూర్గంపహాడ్ మేజర్ పంచాయతీ అభివృద్ధిలో భాగంగా సర్పంచ్ మందా నాగరాజు పర్యవేక్షణలో శనివారం రోడ్లకు ఇరువైపులా ఉన్న ముళ్లపొదలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. బూర్గంపహాడ్-లక్ష్మీపురం రహదారిలో ఇరువైపులా భారీగా పెరిగిన చెట్లకొమ్మలు, పొదల కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించి వాటిని తొలగించే చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్లపొదలు, పిచ్చిచెట్లను తొలగించి శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు సభ్యురాలు ఆకుల ఈరమ్మ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.