రామవరం, నవంబర్ 12 : మొత్తం 1,258 మంది బదిలీ వర్కర్లకు సింగరేణి యాజమాన్యం జనరల్ అసిస్టెంట్ కేటగిరి-1గా క్రమబద్ధీకరణ లెటర్లు ఇవ్వనున్నట్లు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ బుధవారం వెల్లడించారు. గుర్తింపు సంఘం ఒత్తిడి వల్ల గడిచిన 2024 సంవత్సరంలో మైన్స్, డిపార్ట్మెంట్స్ నందు 190/240 మాస్టర్స్ పూర్తి చేసిన బదిలీ వర్కర్లకు ఏరియా వారీగా జనరల్ అసిస్టెంట్ గా క్రమబద్ధీకరణ చేస్తూ యాజమాన్యం వివరాలు వెల్లడించింది.
• రామగుండం -2 : 299 మంది
• భూపాలపల్లి : 252 మంది
• శ్రీరాంపూర్ : 236 మంది
• రామగుండం-3 & అడ్రియాల : 167 మంది
• రామగుండం-1 : 162 మంది
• మందమర్రి : 65 మంది
• కార్పోరేట్ : 21 మంది
• కొత్తగూడెం : 21 మంది
• మణుగూరు : 18 మంది
• బెల్లంపల్లి : 11 మంది
• ఇల్లెందు : 6 మంది