ఎర్రుపాలెం, జూన్ 08 : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని బనిగండ్లపాడు గ్రామానికి చెందిన రేషన్ డీలర్ బాణాల వెంకటరమణ(47) సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మరణవార్త గ్రామంలో విషాదాన్ని నింపింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు.
గ్రామ ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా సేవలందించిన వెంకటరమణ మృతిపై పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.