బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ రిపీట్?
ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో కల్యాణ్‌రామ్ సినిమా నిర్మిస్తున్నట్టు శనివారం అధికారికంగా బయటకొచ్చిన వార్త నందమూరి అభిమానుల్లో ఫుల్ జోష్ని నింపింది. ఆ జోష్ని రెట్టింపు చేస్తూ ఆ వెంటనే మరో వార్త కూడా ఫిల్మ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్నది.
ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో కల్యాణ్‌రామ్ సినిమా నిర్మిస్తున్నట్టు శనివారం అధికారికంగా బయటకొచ్చిన వార్త నందమూరి అభిమానుల్లో ఫుల్ జోష్ని నింపింది. ఆ జోష్ని రెట్టింపు చేస్తూ ఆ వెంటనే మరో వార్త కూడా ఫిల్మ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్నది. ఆ వివరాల్లోకెళ్తే.. అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘నేలకొండ భగవంత్‌కేసరి’ చిత్రం ఏ స్థాయి విజయాన్ని అందుకుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. రివార్డులతోపాటు అవార్డులను కూడా ఆ సినిమా సొంతం చేసుకున్నది.
త్వరలో మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ కానున్నదని, అగ్ర నిర్మాత దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించనున్నారని, 2028 సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానున్నదనేది ఈ వార్త సారాంశం. ప్రస్తుతం అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’ చిత్రం పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఆయన ఎన్టీఆర్‌తో సినిమా చేస్తారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. మరి ఎన్టీఆర్ సినిమాను అనిల్ ఎప్పుడు పూర్తి చేస్తారు?.. బాలకృష్ణ సినిమాను ఎప్పుడు మొదలుపెడతారు?.. అసలు ఈ సినిమాలకు సంబంధించిన కథలు ఆయన దగ్గర సిద్ధంగా ఉన్నాయా? బాలయ్య సినిమాకు సంబంధించిన వార్తలో నిజమెంత? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

