రామవరం, సెప్టెంబర్ 15 : సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ మెంబర్ రాములు నాయక్ ఎంపికయ్యారు. సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోళ్ల రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్య కృష్ణమూర్తి కొరక మేరకు ఈ బాధ్యతలు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. గిరిజన ఉద్యోగుల సమస్యలను అతి త్వరలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సింగరేణి సిఎండి ఎన్.బలరామ్ నాయక్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బొర్రా రాంబాబు, భూపాలపల్లి ఏరియా లైజన్ ఆఫీసర్ కల్తీ రమేష్, అసోసియేషన్ సభ్యులు మోదిన్ నాయక్, ధరావత్ రమేష్, ఇస్లావత్ గౌతమ్, సురేష్, సాయి పాల్గొన్నారు.