రుద్రంపూర్, ఆగస్టు 25 : కొత్తగూడెం బార్ అసోసియేషన్‌లో బ్రహ్మకుమారి సమాజం వారి ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి సోదరీమణులు కొత్తగూడెం బార్ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాదులందరికీ ప్రేమాభిమానాలతో రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు. రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆత్మీయత, పరస్పర గౌరవం మరియు సోదరభావాన్ని పెంపొందించే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించింది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ ముదల్కర్, ప్రధాన కార్యదర్శి మహేశ్ గడిపెల్లి, కార్యవర్గ సభ్యులు గడదాసు నాగరాజు, ప్రసాద్ దొడ్డ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

కొత్తగూడెం బార్ అసోసియేషన్‌లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు