రామవరం, అక్టోబర్ 14 : కొత్తగూడెం ఏరియాలో పని చేస్తున్న అర్హత కలిగిన ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ వారికి సర్ఫేస్ బదిలీ కోసం మంగళారం కౌన్సిలింగ్ నిర్వహించారు. కొత్తగూడెం ఏరియాలోని పద్మావతి ఖని అండర్ గ్రౌండ్ నందు పని చేస్తున్న ఫిట్టర్, ఎలక్ట్రిషయన్ డిసిగ్నేషన్ వారికి సత్తుపల్లిలోని జెవిఆర్ఓసి.II, జెవిఆర్ సిహెచ్ పి, కిష్టారం ఓసిలలో (సర్ఫేస్) ఫిట్టర్ (10), ఎలక్ట్రిషన్ (16) కోసం వారి అర్హతలను పరిశీలించుట కొరకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం జీవి కోటిరెడ్డి, ఏరియా ఇంజినీర్ కె.సూర్యనారాయణ రాజు, డిజిఎం(పర్సనల్) జీ.వి.మోహన్ రావు, డిజిఎం (ఐఈ) ఎన్.యోహన్ పాల్గొన్నారు.