భద్రాచలం:భద్రాచలం ఏజన్సీలో ఉన్న ఏకైక బీఈడీ కళాశాల ఉనికిని కాపాడాలని భద్రాచలం ఆదివాసీ సంఘం ప్రధాన కార్యదర్శి పాయం రవివర్మ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్‌కు పీహెచ్డీ ఉండాలి. కానీ ప్రస్తుతం ఉన్న ప్రిన్సిపాల్‌కు బీఈడీ లేదని, పీహెచ్డీ ఉన్నవారిని నియమించాలని కాకతీయ యూనివర్సీటీ అధికారులు ఐటీడీఏ పీఓకు లేఖ ద్వారా తెలిపారని చెప్పారు.
బీఈడీ కళాశాల కౌన్సిలింగ్ ప్రక్రియను ఎడ్‌సెట్‌కు మినహాయింపుగా డిగ్రీ మార్కుల ఆధారంగా చేపట్టి ఎడ్‌సెట్ జాయినింగ్‌కి ముందస్తుగా పూర్తి చేయాల్సి ఉందన్నారు. కానీ ఇంతవరకు మెరిట్ జాబితా, కౌన్సిలింగ్ తేదీలను ఖరారు చేయాలని తెలిపారు. ఎడ్‌సెట్ వెబ్ ఆప్షన్స్ ఈనెల 18 నుంచి 23వరకు కొనసాగుతున్నాయన్నారు.
ప్రస్తుతం నాలుగు రోజులే సమయముందనిలేని పక్షంలో యూనివర్సీటీ అధికారులు బీఈడీ కళాశాల గుర్తింపు రద్దు చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి రద్దు అయితే ట్రైబల్ బీఈడీ కళాశాలను కోల్పోయే ప్రమాదముందని వాపోయారు. అధికారులు నిబంధనల ప్రకారం ప్రిన్సిపాల్‌ను, బోధన సిబ్బందిని నియమించకపోవడంతో పాటు కళాశాలలో ఏర్పాటు చేయాల్సిన ఇతర సౌకర్యాలు కల్పించక పోవడం ప్రధాన కారణమని అన్నారు.