భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 09 : గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సక్రమంగా పోషకాహారం అందించాలని, అప్పుడే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని సీపీపీఓ లక్ష్మిప్రసన్న అన్నారు. బుధవారం పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీదేవిపల్లి అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలకు వెయ్యి రోజుల ప్రాముఖ్యతను గురుంచి వివరించారు. రెండు సంవర్శరం లోపు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పోషకాహార లోపంతో ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పుష్పలత, మణి, లక్ష్మి, ఆశ, మిషన్ శక్తి (హబ్) నుండి స్వాతి, సూపర్వైజర్ రమాదేవి పాల్గొన్నారు.