చుంచుపల్లి, డిసెంబర్ 10 : చుంచుపల్లి మండల పరిధిలోని రుద్రంపూర్ గ్రామానికి చెందిన పొన్నాల పృథ్వీరాజ్ జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. 47వ నేషనల్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ క్రీడలో ప్రతిభ కనపరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 14 నుండి 18వ తేదీ వరకు పశ్చిమ బెంగాల్లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా సాఫ్ట్‌బాల్ సెక్రటరీ నవీన్, రుద్రంపూర్ హైస్కూల్ పీడీ కవిత, అథ్లెటిక్స్ అబ్జర్వర్ మహీధర్, పలువురు గ్రామస్తులు పృథ్వీరాజ్‌కు అభినందనలు తెలిపారు.