– కొత్తగూడెం మున్సిపల్ ఎన్నికలపై పిటిషన్లు దాఖలు
– ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ
రుద్రంపూర్, ఏప్రిల్ 10 : ఇటీవల జరిగిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై రెండు ఎన్నికల పిటిషన్లు దాఖలయ్యాయి. డివిజన్ 47 (పాత పాల్వంచ), డివిజన్ 54 (సఫాయి బస్తీ) ఎన్నికలను రద్దు చేసి, గెలిచిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ జిల్లా కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. డివిజన్ 47లో సీపీఐ అభ్యర్థి గుర్రం వెంకటేశ్వర్లు గెలుపును సవాలు చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి మిర్యాల అలివేలు పిటిషన్, అలాగే డివిజన్ 54లో కాంగ్రెస్ అభ్యర్థి జయంతి మసూద్ గెలుపును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి మాదాసు పద్మ పిటిషన్ వేశారు. ఈ రెండు కేసుల్లో పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఎండీ.సాదిక్ పాషా, డి.సామంత్, సంకుబాపన అనుదీప్ వాదనలు వినిపించారు. పిటిషన్లను పరిశీలించిన జిల్లా కోర్టు వాటిని స్వీకరించి, ఎన్నికల పిటిషన్ నంబర్లు 2/2026 , 3/2026గా నమోదు చేసినట్లు, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను మే 6కు వాయిదా వేసినట్లు వారు పేర్కన్నారు.