జూలూరుపాడు, ఆగస్టు 11 : రాష్ట ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని సిపిఐ జిల్లా సమితి సభ్యుడు గుండెపిన్ని వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ఆయన స్పందిస్తూ.. రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావొస్తున్నా నూతన పెన్షన్లపై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. కొత్త పెన్షన్ల మంజూరు కోసం వేలాది మంది అర్హులైన వృద్ధులు వితంతువులు, వికలాంగులు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. అనేకమంది భర్తను కోల్పోయిన వితంతువులు ఏ ఆసరా లేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో పెన్షన్ పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు ఆసరా పెన్షన్ దారులకు పెన్షన్ పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.