– జడ్జి స్వరూప కాటం
ఇల్లెందు, జూన్ 09 : ఈనె ల 20వ తేదీన ఇల్లెందు కోర్టు పరిధిలో జరుగు జాతీయ మెగా లోక్ అదాలత్ను జయప్రదం చెయ్యాలని జడ్జి స్వరూప కాటం కోరారు. మంగళవారం స్థానిక ఇల్లెందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో సాయంత్రం ఇల్లెందు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇల్లెందు కోర్టు పరిధిలో గల వివిధ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ.లతో కో ఆర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జడ్జి స్వరూప కాటం ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఈ నెల 20న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా అందరూ ఎస్.హెచ్.ఓ.లు బాధ్యతగా సహకరించి రాజీ పడదగిన కేసులను ఇరువర్గాలను సమన్వయ పరిచి, ఆయా స్టేషన్లలో కౌన్సిలింగ్ నిర్వహించి, పెద్ద మొత్తంలో కేసులు రాజీపడే విధంగా కృషి చేసి లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కోర్టు సూపరింటెండెంట్ రామకృష్ణ, కోర్టు పరిధిలోగల పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ.లు, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.