నాగుల చవితి వేడుకల్లో ముస్లిం మహిళల పూజలు
మతాలు వేరైనా మనుషుల మధ్య ఉండాల్సింది మానవత్వం. పరస్పర గౌరవం. సోదరభావమేనని చాటిచెప్పే అందమైన దృశ్యం కొత్తగూడెంలో ఆవిష్కృతమైంది. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం మహిళలు నాగుపుట్టలో పాలు పోసి తమ భక్తిభావాన్ని చాటుకున్నారు.
రుద్రంపూర్, నవంబర్ 13 : మతాలు వేరైనా మనుషుల మధ్య ఉండాల్సింది మానవత్వం. పరస్పర గౌరవం. సోదరభావమేనని చాటిచెప్పే అందమైన దృశ్యం కొత్తగూడెంలో ఆవిష్కృతమైంది. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం మహిళలు నాగుపుట్టలో పాలు పోసి తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. హిందూ సంప్రదాయంలో విశిష్టమైన స్థానమున్న నాగుల చవితి వేడుకల్లో ముస్లిం మహిళలు సైతం పాల్గొని పుట్ట వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించడం స్థానికుల దృష్టిని ఆకర్షించింది. కులమతాలకు అతీతంగా ఇతరుల ఆచారాలు, సంప్రదాయాలను గౌరవిస్తూ పండుగల్లో భాగస్వాములు కావడం భారతీయ సంస్కృతిలోని గొప్పతనానికి నిదర్శనంగా నిలిచింది. మత సామరస్యం, సోదరభావం, పరస్పర గౌరవం వెల్లివిరిసిన ఈ దృశ్యం పలువురిని ఆకట్టుకుంది. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ ప్రత్యేకత అని చాటిచెప్పేలా ముస్లిం మహిళల భాగస్వామ్యం నిలిచింది.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగుల చవితి వేడుకల్లో ముస్లిం మహిళల పూజలు
కాళోజీకి ఘన నివాళి.. న్యాయవాదుల రక్తదానం
Ex-Minister Thalasani | గన్నవరం ఎయిర్‌పోర్టులో మాజీ మంత్రి తలసానికి ఘన స్వాగతం
ఎంజీయూలో అట్టహాసంగా దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్ మహాసభలు ప్రారంభం
Militants Open Fire On Vehicles | మణిపూర్‌లో రహదారిపై వెళ్తున్న వాహనాలపై మిలిటెంట్లు కాల్పులు.. నలుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

