ఎంజీయూలో అట్టహాసంగా దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్ మహాసభలు ప్రారంభం
చరిత్ర పరిశోధనల సందడి.. మేధావుల మంతనాలు.. దేశం నలుమూలల నుండి తరలివచ్చిన ప్రొఫెసర్లు, చరిత్రకారులు, పరిశోధక విద్యార్థులు.. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలతో 45వ దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్ మహాసభలు శుక్రవారం నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
– దేశ వ్యాప్తంగా తరలివచ్చిన ప్రొఫెసర్లు, చరిత్రకారులు, పరిశోధక విద్యార్థులు
రామగిరి, నవంబరు 13 : చరిత్ర పరిశోధనల సందడి.. మేధావుల మంతనాలు.. దేశం నలుమూలల నుండి తరలివచ్చిన ప్రొఫెసర్లు, చరిత్రకారులు, పరిశోధక విద్యార్థులు.. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలతో 45వ దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్ మహాసభలు శుక్రవారం నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 13, 14, 15 తేదీల్లో మహాసభలు కొనసాగనున్నాయి. మహాసభలను ఎంజీయూ వర్సీటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం పునాదులపై నవభారత నిర్మాణానికి చరిత్ర అధ్యయనం ఎంతగానో దోహదపడుతుందన్నారు. సమాజాన్ని హేతుబద్ధంగా అర్థం చేసుకోవడానికి, సమ్మిళిత అభివృద్ధితో మెరుగైన భవిష్యత్‌ను నిర్మించుకోవడానికి చారిత్రక అవగాహన అవసరమని పేర్కొన్నారు. చరిత్ర రచన గత సంఘటనలను నమోదు చేయడానికే పరిమితం కాకుండా, సామాజిక పరిణామాలను విశ్లేషిస్తూ సమానత్వం, ప్రగతికి మార్గనిర్దేశం చేయాలని సూచించారు.
ప్రాంతీయ చరిత్రకు ప్రత్యేక గుర్తింపు కల్పించాలి
దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన లఖ్‌నవూలోని బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేడ్కర్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆచార్యులు ప్రొఫెసర్ విక్టర్‌బాబు అధ్యక్షోపన్యాసం చేస్తూ.. ఉత్తర, దక్షిణ భారత మత, సాంస్కృతిక సంప్రదాయాలను ఒకే కోణంలో చూడకుండా వాటి ప్రాంతీయ ప్రత్యేకతలు, పరస్పర ప్రభావాలను అధ్యయనం చేయాలని అన్నారు. స్థానిక దేవతారాధనలు, గ్రామీణ విశ్వాసాలు, ఆదివాసీ సంప్రదాయాలు, ప్రధాన మత సంప్రదాయాల మధ్య చోటుచేసుకున్న సమన్వయాన్ని సామాజిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యాల్లో విశ్లేషించాలన్నారు. వలసపాలన కాలం నాటి చరిత్ర అధ్యయనాల్లో ప్రతిఫలించిన పక్షపాతాలను విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ, సామాన్య ప్రజల జీవన అనుభవాలకు చరిత్ర రచనలో తగిన స్థానం కల్పించాలని సూచించారు. దక్షిణ భారత చరిత్రను వెలికితీయడంలో కాంగ్రెస్ చేస్తున్న కృషిని వివరించారు.
రాజులు, యుద్ధాలే కాదు.. సామాన్యుల చరిత్రా ముఖ్యం
బెంగళూరు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఎస్కే మస్తాన్‌వలి కీలకోపన్యాసం చేస్తూ.. చరిత్రను రాజులు, సామ్రాజ్యాలు, యుద్ధాలకే పరిమితం చేయకూడదన్నారు. నాగరికత నిర్మాణంలో వ్యవసాయ కూలీలు, రైతులు, చేతివృత్తిదారులు, మహిళలు, దళితులు, ఆదివాసీలు అందించిన సేవలను వెలికితీయాలని చరిత్రకారులకు పిలుపునిచ్చారు. శాసనాలు, పురావస్తు ఆధారాలు, మౌఖిక చరిత్రలు, జానపద సంప్రదాయాలు, సామాజిక ఉద్యమాలను సమన్వయంతో అధ్యయనం చేయాలన్నారు. తెలంగాణ రైతాంగ పోరాటం, కులవివక్ష వ్యతిరేక ఉద్యమాలు, శ్రామికుల ప్రతిఘటనలకు చరిత్రలో సముచిత ప్రాధాన్యం కల్పించాలన్నారు. అణగారిన వర్గాల చరిత్ర పునర్నిర్మాణానికి కృత్రిమ మేధ, డిజిటల్ పరిశోధనా సాధనాలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.

ఎంజీయూలో అట్టహాసంగా దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్ మహాసభలు ప్రారంభం
పరిశోధకులకు పురస్కారాలు.. చరిత్ర గ్రంథాల ఆవిష్కరణ
మహాసభల్లో దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, తెలంగాణ ప్రభుత్వ హెరిటేజ్ అండ్ కల్చర్ శాఖ సంచాలకుడు ప్రొఫెసర్ కె. అర్జునరావు, కాంగ్రెస్ కార్యదర్శి ప్రొఫెసర్ సదాశివన్ పాల్గొన్నారు. కస్తూరి మిశ్రా స్మారక యువ చరిత్రకారుల పురస్కారాలతోపాటు ప్రొఫెసర్ పెర్రారపు చెన్నారెడ్డి–డాక్టర్ సుభాషిణి ఉత్తమ పరిశోధన పత్ర పురస్కారం, డాక్టర్ బాలమగురుస్వామి–శ్రీమతి ఆర్. ఉమ ఉత్తమ పరిశోధన పత్ర పురస్కారాలను ప్రదానం చేశారు. ఐదుగురు పరిశోధకులు, అధ్యాపకులు రచించిన చరిత్ర గ్రంథాలను ఆవిష్కరించారు.
వివిధ అంశాలపై పరిశోధనా పత్రాల సమర్పణ
మధ్యాహ్నం నిర్వహించిన ప్రత్యేక సమావేశాల్లో రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక చరిత్ర, చరిత్ర రచన, సముద్ర వాణిజ్య చరిత్ర, అణగారిన వర్గాల చరిత్ర తదితర అంశాలపై పరిశోధకులు తమ పత్రాలను సమర్పించారు. ప్రొఫెసర్ బీసీ రాయ్ స్మారకోపన్యాసాన్ని డాక్టర్ కె. రాజన్, కస్తూరి మిశ్రా స్మారకోపన్యాసాన్ని డాక్టర్ పరిమళ ఖడంగ, డాక్టర్ సుభాషిణి ధర్మనిధి ఉపన్యాసాన్ని ప్రొఫెసర్ శ్రీనాథ్ అందించారు. అనంతరం కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
తెలంగాణ కళారూపాలతో సాంస్కృతిక సందడి
విశ్వవిద్యాలయంలోని నూతన ఆంఫిథియేటర్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు, తెలంగాణ జానపద కళారూపాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దేశవ్యాప్తంగా వచ్చిన చరిత్రకారులు, ఆచార్యులు, పరిశోధకుల మధ్య విద్యా చర్చలతోపాటు స్థానిక కళాసంప్రదాయాల ప్రదర్శన మహాసభలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చింది. ఈ కార్యక్రమాల్లో ఎంజీయూ రిజిస్ట్రార్, సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి, కో కన్వీనర్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణప్రియ, దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్ ఆఫీస్ బేరర్లు, జాయింట్ సెక్రటరీలు, ఈసీ సభ్యులు, వివిధ సెషన్ల అధ్యక్షులు, ఎంజీయూ చరిత్ర విభాగం అధ్యాపకులు, సదస్సు కో కన్వీనర్ ప్రొఫెసర్ విజయబాబు, మహాసభల స్థానిక కార్యదర్శి, హిస్టరీ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ అధ్యాపకులు డాక్టర్ పనస రామకృష్ణ, ఎంజియూ డీన్ ప్రొఫెసర్ ఆకుల రవి, ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి, మాజీ రిజిస్టర్ ప్రొఫెసర్ అల్వాల రవి, హిస్టరీ టూరిజం విభాగం విభాగం అధ్యాపకులు డాక్టర్ షరీఫ్, డాక్టర్ శ్రీనివాస్, వివేక్, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, డైరెక్టర్లు, విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన పరిశోధకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూలో అట్టహాసంగా దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్ మహాసభలు ప్రారంభం
Militants Open Fire On Vehicles | మణిపూర్‌లో రహదారిపై వెళ్తున్న వాహనాలపై మిలిటెంట్లు కాల్పులు.. నలుగురు మృతి
వేర్ల వ్యాపారం మాటున కలప దందా?
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

