Militants Open Fire On Vehicles | మణిపూర్‌లో రహదారిపై వెళ్తున్న వాహనాలపై మిలిటెంట్లు కాల్పులు.. నలుగురు మృతి
Militants Open Fire On Vehicles | మణిపూర్‌లో జాతి హింస కొనసాగుతున్నది. ఇంఫాల్-ఉఖ్రుల్ రహదారిపై వెళ్తున్న రెండు వాహనాలపై మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఒక వాహనంలో ఉన్న తల్లీకుమారుడు, మరో వాహనంలో ప్రయాణించిన ఇద్దరు సోదరులు మరణించారు.
ఇంఫాల్: మణిపూర్‌లో జాతి హింస కొనసాగుతున్నది. ఇంఫాల్-ఉఖ్రుల్ రహదారిపై వెళ్తున్న రెండు వాహనాలపై మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఒక వాహనంలో ఉన్న తల్లీకుమారుడు, మరో వాహనంలో ప్రయాణించిన ఇద్దరు సోదరులు మరణించారు. (Militants Open Fire On Vehicles) శుక్రవారం ఇంఫాల్ వైపు ప్రయాణిస్తున్న రెండు వాహనాలను మిలిటెంట్లు లక్ష్యంగా చేసుకున్నారు. ‘న్యూ హేవన్’ వద్ద మెరుపుదాడికి పాల్పడి కాల్పులు జరిపారు. ఒక వాహనంలో ప్రయాణించిన తషార్ గ్రామానికి చెందిన తల్లి, కుమారుడైన ఆగస్ట్ నగాలుంగ్, ఖాన్మిలా ఈ కాల్పుల్లో మరణించారు. అలాగే మరో వాహనంలో వెళ్తున్న షాంగ్షాక్ గ్రామానికి చెందిన సోదరులైన కపాంగ్ఖుయ్ ఆర్ఎస్, హౌలీలా ఆర్ఎస్ కూడా కాల్పుల్లో చనిపోయారు.
కాగా, మణిపూర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నేత కె. మేఘచంద్ర ఈ కాల్పుల సంఘటనను ఖండించారు. జాతి హింసను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. నాగా ప్రజలతో సహా వివిధ వర్గాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్‌లో మూడున్నరేళ్లకు పైగా హింస కొనసాగుతున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు భద్రత కల్పించడంలో, సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడంలో విఫలమైన సీఎం ఖేమ్‌చంద్ నేతృత్వంలోని ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Militants Open Fire On Vehicles | మణిపూర్‌లో రహదారిపై వెళ్తున్న వాహనాలపై మిలిటెంట్లు కాల్పులు.. నలుగురు మృతి
వేర్ల వ్యాపారం మాటున కలప దందా?
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

