కాళోజీకి ఘన నివాళి.. న్యాయవాదుల రక్తదానం
ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని కాళోజీ తెలంగాణ జూనియర్ లేడీ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా అధ్యక్షురాలు పి.భవాని అన్నారు. కాళోజీ 24వ వర్ధంతిని పురస్కరించుకుని...
రామగిరి, నవంబరు 13 : ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని కాళోజీ తెలంగాణ జూనియర్ లేడీ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా అధ్యక్షురాలు పి.భవాని అన్నారు. కాళోజీ 24వ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం నల్లగొండ బార్ అసోసియేషన్ హాల్లో కాళోజీ తెలంగాణ జూనియర్ లేడీ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నల్లగొండ బార్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా భవాని మాట్లాడుతూ.. కాళోజీ తన కవిత్వం ద్వారా ప్రజల కష్టాలు, కన్నీళ్లు, ఆకాంక్షలకు అక్షరరూపం ఇచ్చిన గొప్ప ప్రజాకవి అని కొనియాడారు. అన్యాయాలు, సామాజిక అసమానతలను ప్రశ్నిస్తూ ప్రజల్లో చైతన్యం నింపారని పేర్కొన్నారు.
రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడే గొప్ప మానవతా కార్యక్రమమని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాళోజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్‌లోనూ సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. శిబిరాన్ని నల్లగొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ.సతీష్ కుమార్, కార్యదర్శి బి.అశోక్ కుమార్ ప్రారంభించారు. మహిళా న్యాయవాదులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పజ్జూరి స్వామిగౌడ్, నూకల సంధ్యారాణి, పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాళోజీకి ఘన నివాళి.. న్యాయవాదుల రక్తదానం
Ex-Minister Thalasani | గన్నవరం ఎయిర్‌పోర్టులో మాజీ మంత్రి తలసానికి ఘన స్వాగతం
ఎంజీయూలో అట్టహాసంగా దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్ మహాసభలు ప్రారంభం
Militants Open Fire On Vehicles | మణిపూర్‌లో రహదారిపై వెళ్తున్న వాహనాలపై మిలిటెంట్లు కాల్పులు.. నలుగురు మృతి
వేర్ల వ్యాపారం మాటున కలప దందా?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

