వేర్ల వ్యాపారం మాటున కలప దందా?
ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని దుమ్ముగూడెం మండలంతో పాటు ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల్లో అల్లి చెట్ల వేర్ల సేకరణ పేరుతో భారీ కలప అక్రమ దందా సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఔషధ గుణాలున్నాయనే ప్రచారాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు గిరిజనులతో అడవుల్లోని...
– దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం నుండి అక్రమ రవాణా
– అటవీశాఖ అధికారుల ఉదాసీనత
– పట్టుకున్న వ్యాన్ అంచనా విలువ లెక్కించని అధికారులు
– చెక్ పోస్టులు దాటుతున్న అటవీ సంపదను పట్టించుకునేదెవరు?
భద్రాచలం/ దుమ్మగూడెం, నవంబరు 13 : ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని దుమ్ముగూడెం మండలంతో పాటు ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల్లో అల్లి చెట్ల వేర్ల సేకరణ పేరుతో భారీ కలప అక్రమ దందా సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఔషధ గుణాలున్నాయనే ప్రచారాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు గిరిజనులతో అడవుల్లోని అల్లి చెట్ల వేర్లు, బెరడు సేకరింపజేస్తూ కోట్ల రూపాయల వ్యాపారానికి తెరలేపినట్లు సమాచారం. చర్ల, దుమ్ముగూడెం మండలాల అటవీ ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని ఈ వ్యవహారం సాగుతున్నట్లు తెలుస్తోంది. దుమ్ముగూడెం మండల కేంద్రమైన లక్ష్మీనగరం సంత వ్యాపారులే ఈ దందాను యధేచ్చగా సాగిస్తున్నట్లుగా సమాచారం. ఇది ఇటీవల కాలంలో మరింత జోరు పెరిగింది. అటవీ ప్రాంతాల్లోకి వెళ్లి చెట్ల వేర్లు, బెరడు సేకరించే పనిని స్థానిక గిరిజనులకు అప్పగిస్తూ కిలోకు రూ.50 చెల్లిస్తున్నట్లు సమాచారం. వారి నుండి సేకరించిన వేర్లను మధ్యవర్తులు కిలో రూ.250కు కొనుగోలు చేసి, విజయవాడ, తిరువూరు, తమిళనాడు ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుండి కిలో రూ.2,500 వరకు ధర పలుకుతూ తమిళనాడుకు సరఫరా అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గిరిజనుల శ్రమను ఆసరాగా చేసుకుని సిండికేట్ సభ్యులు భారీ లాభాలు ఆర్జిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దుమ్ముగూడెం మండలంలో ఈ దందా ఏ స్థాయిలో సాగుతోందో అక్టోబర్ నెలలో జరిగిన వేర్ల సేకరణే అద్దం పడుతోంది.
ఒక్క నెలలోనే సుమారు 1.25 లక్షల కిలోల అల్లి చెట్ల వేర్లను సేకరించినట్లు సమాచారం. వీటిని 25 కిలోల బస్తాలుగా తయారుచేసి బట్టిగూడెం, కోడివారిగుంపు, నల్లపల్లి గ్రామాల సమీపంలోని గోదావరి తీర ప్రాంతాల్లో రహస్యంగా నిల్వ చేసినట్లు తెలుస్తోంది. సాధారణ గుడిసెల మాదిరిగా కనిపించే ప్రాంతాలను నిల్వ కేంద్రాలుగా మార్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరికొంత సరుకును చర్ల మండలంలోనూ దాచినట్లు సమాచారం. వేర్ల సేకరణ, నిల్వ, రవాణా వంటి పనులన్నీ స్థానికులతో చేయిస్తూ వచ్చిన లాభాలన్నీ సిండికేట్ సభ్యులు తమ జేబుల్లో వేసుకుంటున్నారనే అసంతృప్తి క్రమంగా బయటపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో విషయం బయటకు పొక్కకుండా మూడు వేర్వేరు రహస్య ప్రాంతాల్లో నిల్వ చేసిన సుమారు 12.50 మెట్రిక్ టన్నుల వేర్లను ఇటీవల ఏపీ మీదుగా తమిళనాడుకు తరలించినట్లు సమాచారం. దీపావళి పండుగ సందడిని ఆసరాగా చేసుకుని నవంబర్ 6, 7 తేదీల్లో రెండు వేర్వేరు మినీ ట్రక్కుల ద్వారా ఈ సరుకును తరలించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రవాణాలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురైనట్లు కూడా సమాచారం. దీంతో దుమ్ముగూడెం మండలంలోని మరో రహస్య ప్రాంతంలో మిగిలిపోయిన చివరి నిల్వను ఎలా తరలించాలనే దానిపై సిండికేట్ సభ్యులు తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వేర్లను బస్తాల్లో భద్రాచలం తరలించి ప్రయివేటు ట్రాన్స్‌పోర్టు కంపెనీల ద్వారా విజయవాడ, తమిళనాడులోని వివిద ప్రాంతాలకు యధేచ్చగా తరలిస్తున్నట్లు సమాచారం.

వేర్ల వ్యాపారం మాటున కలప దందా?
ఉదాసీనంగా వ్యవహరిస్తున్న అటవీ శాఖ అధికారులు
ఇటీవల కాలంలో రెండు ఆటోలను అటవీ శాఖ అధికారులు వదిలివేసిన సంఘటన జరిగినట్లు తెలిసింది. అదేవిధంగా గత 20 రోజుల క్రితం భద్రాచలం ఫారెస్ట్ డిపోలో మినీ వ్యాన్‌ను తీసుకొచ్చి నేటి వరకు వాల్యుయేషన్ వేయలేదు. దీనిపై వివరణ కోరగా హైదరాబాద్ పోయారని తెలిసింది. ఇంత జరుగుతున్నా అధికారులకు తెలియనట్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్దం కావడం లేదని మండలవాసులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా సీజ్ చేసిన మినీ వ్యాన్‌ను స్క్యాడ్ అధికారులు పట్టుకొని తీసుకొచ్చి అటవీశాఖ కార్యాలయంలో అప్పగించగా నేటి వరకు వాల్యుయేషన్ వేయలేదు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

